అజ్ఞాతవాసి కథ ఇదేనట..! | Filmibeat Telugu

2017-12-14 2

Pawan Kalyan's Agnathavasi story viral in social media. This movie story is quiet interesting. This movie set to release on January 2018. Meanwhile, huge preparatons are for Agnathavasi audio is on card.

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో సినిమా అంటే అదో సెన్సేషన్. జల్సా, అత్తారింటికి దారేది చిత్రాలు వారిద్దరి స్టామినాకు అద్దం పట్టాయి. తాజాగా అజ్ఞాతవాసి చిత్రంతో మూడోసారి జతకట్టిన పవన్, త్రివిక్రమ్ హ్యాట్రిక్ విజయానికి సిద్ధమవయ్యారు. అయితే అజ్ఞాతవాసి చిత్రానికి సంబంధించిన కథ ఇదేనంటూ..సోషల్ మీడియాలో ఓ స్టోరి హల్‌చల్ చేస్తున్నది. ఇంతకు అదేనా అజ్ఞాతవాసి కథ అంటూ ఆసక్తి పెరుగుతున్నది.
ఓ సంపన్నుడికి ఇద్దరు భార్యలు ఉంటారు. ప్రత్యర్థుల కుట్రలో ఆ సంపన్నుడు ప్రాణాలు కోల్పోతాడు. వెలకట్టలేని సంపన్నుడి ఆస్తి కాజేయడానికి ప్రత్యర్థులు ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో మొదటి భార్యకు ఓ కొడుకు ఉంటాడు. ఆస్తి మొత్తం అతడి పేరిటే ఉంటుంది అనే విషయం వెలుగు చూస్తుంది.
కొడుకు పేరిటనే సంపద ఉంది అని సంపన్నుడి రెండో భార్య తెలుసుకొంటుంది. అజ్ఞాతవాసంలో ఉన్న కొడుకు గురించి తల్లి వెతుక్కుంటూ బయలుదేరుతుంది. అజ్ఞాతవాసంలో ఉన్న కొడుకును తల్లి కలిసిందా? కొడుకు అజ్ఞాతవాసిగా ఎందుకు మారాడు. తల్లి, కొడుకులు కలిసిన తర్వాత కథ ఎలాంటి మలుపులు తిరిగింది. తండ్రికి జరిగిన అన్యాయాన్ని కొడుకు ఎలా ఎదుర్కొన్నాడు అనే ప్రశ్నలకు సమాధానమే అజ్ఞాతవాసి కథ అంటున్నారు.